చిరు సినిమా క్లైమాక్స్‌పై క్రేజీ అప్‌డేట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' రేపు (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
విశ్వంభర, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' రేపు (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే, సినిమా విడుదలకు ముందే క్లైమాక్స్ సీక్వెన్స్‌పై ఒక ఆసక్తికరమైన అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా, క్లైమాక్స్‌లో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విలన్లు టార్గెట్ చేస్తారట. వేరు వేరు ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో చిరంజీవికి తోడుగా విక్టరీ వెంకటేష్ సడెన్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి శత్రువుల పని పట్టే సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని ఇండస్ట్రీ టాక్. ఈ 'మెగా-విక్టరీ' కాంబో ఫ్యాన్స్‌కు అసలైన పండగ ట్రీట్ అని చెప్పాలి.
ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ.. "ఇది ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్. కథ విన్నప్పుడే నాకు బాగా నచ్చింది, ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని ధీమా వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు చిరు వింటేజ్ స్వాగ్ కలగలిపి ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండబోతున్నాయని అభిమానులు అంటున్నారు.



