అంకుసాపూర్‌లో శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహణ
On
తంగళ్ళపల్లి,ఏప్రిల్ 10 ( విశ్వoభర):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన దేవాలయంలో మూడు రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలు 10-04-2026 శుక్రవారం ప్రారంభమై, 11-04-2026 శనివారం కొనసాగి, 12-04-2026 ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మహా అన్నదాన కార్యక్రమంతో ముగిశాయి.ఈ మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలు అందించారు. దేవాలయ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు మరియు అంకుసాపూర్ గ్రామస్థులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.



