Alcohol: ఒక్క రోజు తాగితే ఏమవుతుంది? అనుకుంటే ఇదే సమాధానం..!!

Alcohol: ఒక్క రోజు తాగితే ఏమవుతుంది? అనుకుంటే ఇదే సమాధానం..!!

Alcohol: పార్టీల్లోనో, స్నేహితులతో సరదాగా కలిసినప్పుడో… ఒక్కసారి ఎక్కువగా తాగితే ఏమవుతుంది? అని చాలా మంది లైట్‌గా తీసుకుంటారు. కానీ ఈ అలవాటు మీ పేగులకు ఎంతటి నష్టం చేస్తుందో మీకు తెలుసా? తాజాగా వెలువడిన ఓ అంతర్జాతీయ పరిశోధన ఈ విషయంలో షాకింగ్ నిజాలను బయటపెట్టింది.

Alcohol: పార్టీల్లోనో, స్నేహితులతో సరదాగా కలిసినప్పుడో… ఒక్కసారి ఎక్కువగా తాగితే ఏమవుతుంది? అని చాలా మంది లైట్‌గా తీసుకుంటారు. కానీ ఈ అలవాటు మీ పేగులకు ఎంతటి నష్టం చేస్తుందో మీకు తెలుసా? తాజాగా వెలువడిన ఓ అంతర్జాతీయ పరిశోధన ఈ విషయంలో షాకింగ్ నిజాలను బయటపెట్టింది.

Read More ఘనంగా వీత్రీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ.

వైద్య నిపుణుల ప్రకారం, కేవలం ఒక్కసారే పరిమితికి మించి మద్యం సేవించినా పేగుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. సాధారణంగా రెండు గంటల వ్యవధిలో మహిళలు నాలుగు పెగ్గులు, పురుషులు ఐదు పెగ్గులు లేదా అంతకంటే ఎక్కువగా తాగితే దాన్ని బింజ్ డ్రింకింగ్ గా పరిగణిస్తారు. ఇది అలవాటుగా మారాల్సిన అవసరం కూడా లేదు… ఒక్కసారి జరిగినా ప్రమాదమేనని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో పాటు బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. వారి పరిశోధనలో, అతిగా మద్యం తాగిన వెంటనే పేగుల గోడలు బలహీనపడతాయని తేలింది. ఫలితంగా పేగుల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, విషపదార్థాలు నేరుగా రక్తంలోకి చేరుతాయి. ఈ పరిస్థితినే వైద్య భాషలో “లీకీ గట్అంటారు. దీని వల్ల శరీరంలో వాపు పెరగడం, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అధ్యయనంపై స్పందించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ గ్యాంగీ సాబో మాట్లాడుతూ, ఒక్కసారి అతిగా తాగినప్పటికీ పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్ ప్రారంభమవుతుంది. ఇది భవిష్యత్తులో ఆల్కహాల్‌కు సంబంధించిన పేగు, కాలేయ వ్యాధులకు తొలి అడుగు కావచ్చు అని హెచ్చరించారు.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… అతిగా మద్యం తాగినప్పుడు శరీరంలోని రోగనిరోధక కణాలు, ముఖ్యంగా ‘న్యూట్రోఫిల్స్’ అనే కణాలు, పేగులపై పొరను దెబ్బతీసే వల లాంటి నిర్మాణాలను విడుదల చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. అయితే, ఒక ప్రత్యేక ఎంజైమ్ ద్వారా ఈ ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించవచ్చని కూడా వారు తెలిపారు. భవిష్యత్తులో ఇది ఆల్కహాల్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించే కొత్త చికిత్సలకు దారి చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి, అప్పుడప్పుడే కదా అనే ఆలోచనతో అతిగా మద్యం తాగడం మీ శరీరాన్ని మౌనంగా నష్టపరుస్తోంది. సరదా కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం, భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.