''అమరావతికి ఆహ్వానం'' చిత్ర బృందానికి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

''అమరావతికి ఆహ్వానం'' చిత్ర బృందానికి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

విశ్వంభర, హైదరాబాద్ : ఈనెల 13న విడుదలకు సిద్ధమవుతున్న హర్రర్ కామెడీ చిత్రం'' అమరావతికి ఆహ్వానం'' విజయవంతం కావాలని కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాదు బర్కత్పుర లో ఆయన నివాసంలో చిత్ర బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ, సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు జీవీకే, నిర్మాత,  హీరో శివ కంటమనేని, రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా మీడియా కన్వీనర్ ఐజాక్ రాజ్, బీజేపీ నాయకురాలు, నటి విజయ శ్రీ చౌదరి, రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి గంధ మల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: