ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఎక్కడికంటే..?
ప్రధాని మోడీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. గురువారం నుంచి మూడు రోజులు ఆయన ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడీ ఇటలీలో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరవుతారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా,ప్రధాని మోడీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. గురువారం నుంచి మూడు రోజులు ఆయన ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడీ ఇటలీలో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరవుతారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ సదస్సులో భాగంగా అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, అబుధాబి రాజు షేక్ మోహమ్మద్ బిన్ జాయద్, మరి కొందరు అరబ్ రాజకుటుంబీకులను మోడీ కలవనున్నారు. మోడీ పర్యటన, సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇటలీలోని భారత రాయబారి ఎస్.వాణి రావు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ప్రధానిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన మోడీకి వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు చెప్పనున్నారు. అదేవిధంగా ప్రధానిలో త్వరలోనే బిమ్స్‌టెక్, జీ–20, ఆసియన్– ఈస్ట్ ఆసియా సదస్సులకు హాజరుకానున్నట్లు సమాచారం.