Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో ఉద్రిక్తత.. భారత విద్యార్థులకు అలర్ట్..!

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో ఉద్రిక్తత.. భారత విద్యార్థులకు అలర్ట్..!

కిర్గిస్థాన్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని నగరం బిషెక్ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని అల్లర్లకు పాల్పడుతున్నారు.

కిర్గిస్థాన్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని నగరం బిషెక్ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని అల్లర్లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బయటకు ఎవరూ రావొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. 

భారతీయ విద్యార్థులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని పేర్కొన్నారు. అల్లర్ల నేపథ్యంలో విద్యార్థులు మాత్రం ఎట్టిపరిస్థితిల్లో బయటకు రావొద్దని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే ఎంబసీ అధికారులను సంప్రదించాలని సూచించారు. 24గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నెంబర్‌ (0555710041)ను షేర్ చేశారు.

Read More రోబోటిక్ కొరియర్ సర్వీస్‌ తో నెం 1 శ్రీధర్ - దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్

కిర్గిస్థాన్, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య ఈనెల 13వ తేదీన ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మూకలు బిషేక్‌లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవాళ ఉదయం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ అల్లర్లపై స్పందిస్తూ భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ అల్లర్లలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి పాక్ ప్రభుత్వం  అధికారికంగా ధ్రువీకరించలేదు.

Related Posts