కదులుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

కదులుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

విశ్వంభర ఇంటర్నేషనల్ బ్యూరో: థాయ్‌లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని సిఖియో జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం పనులు జరుగుతున్న సమయంలో, ఒక భారీ క్రేన్ అదుపుతప్పి పక్కనే ఉన్న పట్టాలపైకి జారిపడింది. ఆ సమయంలో పట్టాలపై వెళ్తున్న ప్రయాణికుల రైలుపై ఆ క్రేన్ పడటంతో ఒక్కసారిగా బోగీలు పట్టాలు తప్పాయి.

ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్రేన్ పడిన ధాటికి కొన్ని బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే థాయ్ పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో బోగీలను తొలగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు పనుల్లో భద్రతా లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

Read More  నోరో వైరస్ కలకలం.. 100 మందికి పైగా సోకిన మహమ్మారి..!!