గాంధీజీ పాఠశాల విద్యార్థులు పరేడ్ గ్రౌండ్ లో అద్భుత ప్రదర్శన

విద్యార్థులను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి

గాంధీజీ పాఠశాల విద్యార్థులు పరేడ్ గ్రౌండ్ లో అద్భుత ప్రదర్శన

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో అబ్బురపరిచే ప్రదర్శన చేసిన గాంధీజీ విద్యార్థులు

IMG-20250815-WA0043 ప్రజా విశ్వంభర, నల్లగొండ: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీకి చెందిన గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు 120 మంది చావా చిత్రంలోని చత్రపతి శివాజీ స్టోరీకి సంబంధించిన దేశభక్తి గీతమునకు నృత్యం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. తదుపరి  రోడ్లు,భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లకంటి సత్యం, శంకర్ నాయక్ లు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బద్దుల లక్ష్మారెడ్డిలు, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డిఇఓ బొల్లారం బిక్షపతిల చేతుల మీదుగా నృత్య  ప్రదర్శన చేసిన విద్యార్థులకు ఉత్తమ అవార్డును అందించి, అభినందించారు. 

         ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కృష్ణయ్య, నజీర్, మణిశంకర్, నాగరాజు, వెంకటేశ్వర్లు, సాయి, బోడ విజయ్, డ్యాన్స్ మాస్టర్ తరుణ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు

Tags: