ఈటో మోటార్స్ ఫ్లిక్స్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించిన మంత్రి పొన్నం

ఈటో మోటార్స్ ఫ్లిక్స్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించిన మంత్రి పొన్నం

విశ్వంభర,  హైదరాబాద్: ఐటిసి కాకతీయలో మోటార్స్ నుండి ఫ్లిక్స్ బస్ ఏసి ఎలక్ట్రిక్ బస్సులును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.  ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ తీసుకొచ్చింది. 
దీని ద్వారా రోడ్ టాక్స్ ,రిజిస్ట్రేషన్ టాక్స్ 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని కాలుష్యాన్ని తగ్గించడానికి నగరంలో ఆర్టీసీ బస్సులు ..ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ఆ దిశగా ఆటోలు ఇతర వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల గా మార్చడానికి వారికి సహకారాలు అందిస్తున్నాం.తెలంగాణ లో ఈటొ మోటర్స్  ఫ్లిక్స్ బస్ ఎలక్ట్రిక్ బస్సు మొదటి సారి ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని రవాణా శాఖ కి సంబంధించిన అన్ని నిబంధనలు పాటించండి  కాలుష్యాన్ని తగ్గించడానికి రాబోయే భవిషత్ తరాలకు మరిన్ని రకాల ఈవి బస్సులు రావాలని అన్నారు.

Tags: