ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి తీస్తున్న JCB పై కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు

ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి తీస్తున్న JCB పై కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

8పెద్దపల్లి జిల్లా న్యూస్ జూలై -16 :- ఫారెస్ట్ ల్యాండ్ లో అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తీస్తున్న ఓ JCB పై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామ శివారులోని ఫారెస్ట్ ల్యాండ్ నుండి JCB తో మట్టి తీన్నారన్న సమాచారం మేరకు తాము పట్టుకొని అటవీ శాఖ చట్టాలు 20, 29, 44 ల క్రింద కేసు నమోదు చేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇదే JCB పై  గతంలో 84,000/- రూపాయల  జరిమానా విధించామని అధికారులు తెలిపారు. ఇట్టి JCB యజమాని పై కూడా గతంలో ఫారెస్ట్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన తీరుపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే విషయం ఫారెస్ట్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో కలెక్టర్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలిచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Tags: