ఆధ్యాతిక చింతనతో మానసిక ప్రశాంతత : సబితా ఇంద్రారెడ్డి 

ఆధ్యాతిక చింతనతో మానసిక ప్రశాంతత : సబితా ఇంద్రారెడ్డి 

విశ్వంభర, మహేశ్వర :  మహేశ్వరం మండలం  దుబ్బచర్ల గ్రామంలో శ్రీ శివ రామాంజనేయ స్వామి దేవస్థానములో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమమునకు సర్పంచ్ ఏరువ లిల్లీమేరీ స్లివా రెడ్డి తో కలిసి  మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు.  ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు  ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కి ప్రసాదం  అందజేసి,   జ్ఞాపికను  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి  మాట్లాడుతూ దుబ్బచర్ల గ్రామంలో శ్రీ శివ రామాంజనేయ స్వామి దేవస్థానము నిర్మాణం చాలా బాగుందని, ప్రజలందరూ భక్తి భావం, దైవచింతన కలిగి ఉండాలని.. మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డ్ మెంబర్లు,   కార్యకర్తలు,  గ్రామ భక్తులు  తదితరులు పాల్గొన్నారు,

Tags: