చేప మందు పంపిణీలో విషాదం

చేప మందు పంపిణీలో విషాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. క్యూలైన్‌లో నిలబడిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోగా అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్‌లో నిలబడిన ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగాపోలీసులు గుర్తించారు. 

 మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు ఈ చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏటా ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వారికోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల ముందే చేప మందుకోసం చాలామంది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంకు చేరుకుని షెడ్లలో బస చేశారు. శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమైంది. అయితే కొన్నిగంటల్లో ఈ విషాదం చోటు చేసుకుంది.

Read More పిహెచ్సిలో టాస్క్ ఫోర్స్ సమావేశం