కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు.. సూత్రధారి హైదరాబాదీ డాక్టర్..!

కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు.. సూత్రధారి హైదరాబాదీ డాక్టర్..!

పేద యువకులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. ఈ ఉదంతం కేరళలో వెలుగుచూసింది. ప్రధాన సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రమేయంతో కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పేద యువకులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. ఈ ఉదంతం కేరళలో వెలుగుచూసింది. ప్రధాన సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రమేయంతో కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్‌కు తీసుకెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. పదుల సంఖ్యలో యువకులను ఇరాన్ తీసుకెళ్లిన ఆపరేషన్ చేయించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కొచ్చిలో కిడ్నీ రాకెట్‌లో సబిత్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సబిత్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ చేరుకున్నారు కొచ్చి పోలీసులు. హైదరాబాద్ డాక్టరుకు ఇద్దరు యువకులు సహకరించినట్లు సమాచారం. ఇప్పటికే 40 మంది కిడ్నీలను అమ్మేసినట్లు విచారణలో తేలింది. ఈ విషయం కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు మృతి చెందడంతో బయటపడింది. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20లక్షల వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి రూ.6లక్షలు ముట్టజెబుతున్నారు. 

Read More ఉద్యోగులకు ప్రతినెల 1 వ తేదీన వేతనం చెల్లించాలి 

డోనర్లు ఇరాన్‌ వెళ్లేందుకు కావాల్సిన పాస్‌పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూరుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కీలక సూత్రధారి అయిన హైదరాబాద్ వైద్యుడు బెంగళూరు, హైదరాబాద్‌ యువకులను ఇరాన్‌కు డోనర్లను పంపిస్తున్నట్లు గుర్తించారు. అవయవ రవాణా రాకెట్‌లో అనుమానితుడైన త్రిసూర్‌లోని వలపాడ్‌కు చెందిన సబిత్ నాసర్ (30)ను కొచ్చి విమానాశ్రయం నుంచి అరెస్టు చేయగా, సబిత్‌కు సహకరించిన కొచ్చికి చెందిన మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

అవయవ సేకరణ కోసం భారతదేశం నుండి 20మందిని ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు సుబిత్ పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. నకిలీ ఆధార్,ఇతర గుర్తింపు కార్డులతో కేరళకు చేరుకున్న కొంతమంది వలస కార్మికులను అవయవ లావాదేవీల కోసం సబిత్ ఇరాన్‌కు పంపిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. కేరళలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ముఠాపై కేసు నమోదు చేసి కీలక సూత్రధారి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.