రైలు కింద పడ్డ ప్రేమజంట.. ఆత్మహత్యా? కుట్ర కోణమా? 

రైలు కింద పడ్డ ప్రేమజంట.. ఆత్మహత్యా? కుట్ర కోణమా? 

వరంగల్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలోని ఏడు మోరీల దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు యువతి పేరు సుష్మగా, యువకుడి పేరు చెన్నకేశవగా గుర్తించారు.  

 

Read More రాష్ట్ర మాజీ మంత్రి , BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ ..

అయితే.. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఖమ్మం సారధి నగర్‌కు చెందిన 17 ఏళ్ల యువతి సుష్మ, వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ ఇద్దరు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలించారు. చివరికి ఆమె ఆచూకీ కనిపించకపోవడంతో.. ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 

 

Read More రాష్ట్ర మాజీ మంత్రి , BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ ..

ఈ ఘటనకు కారణం ఆత్మహత్యాయత్నమా? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు. ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలుసా? లేదా? అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుష్మ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా