Indian Navy: భార‌తీయ నేవీ అదుపులో 14 మంది శ్రీలంక జాల‌ర్లు..!

Indian Navy: భార‌తీయ నేవీ అదుపులో 14 మంది శ్రీలంక జాల‌ర్లు..!

ఇంట‌ర్నేష‌న‌ల్ మారిటైం బౌండ‌రీ లైన్‌ దాటిన 14మంది జాలర్లను భారతీయ నేవీ అధికారులు అరెస్టు చేశారు.

ఇంట‌ర్నేష‌న‌ల్ మారిటైం బౌండ‌రీ లైన్‌ దాటిన 14మంది జాలర్లను భారతీయ నేవీ అధికారులు అరెస్టు చేశారు. వారు అయిదు బోట్ల‌లో వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. సీ కుకుంబ‌ర్ చేప‌ల కోసం మే 14వ తేదీన ఐఎంబీఎల్ దాటి వేట‌కు వ‌చ్చిన‌ట్లు తేలింది. రాణి దుర్గావ‌తి పెట్రోలింగ్ నౌక‌కు వాళ్లు ప‌ట్టుబ‌డ్డారు. 

భార‌తీయ జ‌లాల్లోని ఏడు నాటిక‌ల్ మైళ్ల లోప‌ల శ్రీలంక ఫిషింగ్ బోట్ల‌ను ప‌ట్టుకున్న‌ట్లు పెట్రోలింగ్ నౌక ఐసీజీఎస్ రాణి దుర్గావ‌తి నావికులు తెలిపారు. 1981 మారిటైం జోన్ ఆఫ్ ఇండియా యాక్టు ప్ర‌కారం వారిని అరెస్టు చేసినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. అంత‌రించే జాతికి చెందిన సుమారు 200 కేజీల చేప‌లనూ వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..

Related Posts