కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తెలుగు ఎంపీలు..!
On
ఈ సారి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరగా.. బీజేపీ పార్టీ తన మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు వరించాయి.
దాంతో నేడు వారంతా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కూడా బాధ్యతలు తీసుకున్నారు.
ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దాంతో వారికి అధికారులు, ఇటు రాజకీయ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దేశంలోనే అతిచిన్న వయస్కుడైన కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు.



