వైసీపీ అభ్యర్థులపై టీడీపీ మహిళల చెప్పుల దాడి
ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ జయభేరి మోగిస్తోంది. ఇప్పటికే టీడీపీ 132, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నది.
విశ్వంభర, విజయవాడ: ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ జయభేరి మోగిస్తోంది. ఇప్పటికే టీడీపీ 132, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నది. అధికార పార్టీ వైసీపీ కేవలం 13 స్థానాల్లోనే ముందంజలో ఉండి వెనకబడింది. వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి దిశగా పయనిస్తున్నారు. టీడీపీకి వస్తున్న ఫలితాలను చూసి ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు చూసేందుకు ఏర్పాటు చేసిన టీవీలు, ఎల్ఈడీ స్క్రీన్లపై వైసీపీ అభ్యర్థులు, నేతల వీడియోలు వచ్చే సమయంలో టీడీపీ మహిళలు, కార్యకర్తలు వారి ఫొటోలపై చెప్పులతో దాడి చేశారు. స్క్రీన్లపై వారి విజువల్స్ ప్లే కాగానే మహిళలు చెప్పులతో స్క్రీన్లపై కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాడేపల్లి టీడీపీ ఆఫీసులో టీవీ స్క్రీన్‌పై వస్తున్న వైసీపీ నేతల ఫొటోలను చెప్పులతో కొడుతున్న కార్యకర్తలు#ElectionsWithBIGTV #ElectionResults #ResultsWithBIGTV #APElectionResults#APAssemblyResults #LoksabhaElections2024 #AndhraPradesh #TDP #YSRCP #JanasenaParty #BJP pic.twitter.com/J71ciGsmRe
Read More ఘనంగా కబడ్డీ పోటీలు— BIG TV Breaking News (@bigtvtelugu) June 4, 2024