సిట్ బృందానికి పెన్‌డ్రైవ్ ఇచ్చిన టీడీపీ నేతలు.. అందులో ఏముంది?

సిట్ బృందానికి పెన్‌డ్రైవ్ ఇచ్చిన టీడీపీ నేతలు.. అందులో ఏముంది?

ఏపీలో పోలింగ్ రోజు నుంచి జరుగుతున్న హింసపై సిట్ విచారణ జరుపుతోంది. విచారణ పూర్తి అయిన తర్వాత సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ టీడీపీ నేతలు డీజీపీ కార్యాలయంలో సిట్ అధికారులను కలిశారు. అల్లర్లు, హింసకు సంబంధించిన వివరాలను ఓ పెన్‌డ్రైవ్‌లో ఉంచి సిట్ అధికారులకు అందించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు జరపాలని టీడీపీ నేతలు సిట్ అధికారులను కోరారు. దీంతో.. ఈ పెన్‌డ్రైవ్‌లో ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

Read More ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు పెన్షన్లు.. ఏపీ సీఎస్ ఆదేశాలు

అటు.. రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ అధికారులు పర్యటించారు. గొడవలు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. అంతేకాదు.. ఈ అల్లర్లపై స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. నరసరావుపేటలో రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో సిట్ బృందం విచారణ చేపట్టింది. సీఐ భాస్కర్, రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్బీ సీఐ ప్రభాకరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీసింది.  

 

Read More ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు పెన్షన్లు.. ఏపీ సీఎస్ ఆదేశాలు

ఎన్నికల రోజు మొత్తం నరసరావుపేట నియోజకవర్గంలో ఆరు ఘటనలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీ కృష్ణదేవరాయులు వాహనంపై దాడి, టీడీపీ అరవింద్ బాబు వాహనంపై దాడిని కీలకంగా పరిగణించారు. తర్వాత పమిడిపాడులో టీడీపీ, వైసిపీ వర్గాల మధ్య ఘర్షణతో పాటు.. నరసరావుపేటలో గోపిరెడ్డి నివాసంపై జరిగిన దాడిపై అందిన ఫిర్యాదులను కూడా పోలీసులు సిట్ బృందానికి అందించారు. దొండపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ, అరవింద్ బాబు హాస్పిటల్‌పై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించిన వివరాలను కూడా సిట్ సేకరించింది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా