పవన్ కల్యాణ్‌ కు వదిన సురేఖ అదిరిపోయే గిఫ్టు

పవన్ కల్యాణ్‌ కు వదిన సురేఖ అదిరిపోయే గిఫ్టు

 

పవన్ కల్యాణ్‌ కు ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో గెలిచినప్పటి నుంచి పవన్ కల్యాణ్‌ ప్రతి విషయాన్ని తన అన్నయ్య చిరంజీవితో పంచుకుటున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో శాఖలు కేటాయించిన తర్వాత పవన్ కల్యాణ్‌ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. 

Read More మాజీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా వదిన సురేఖ పవన్ కల్యాణ్‌ కు ఓ బహుమతిని ఇచ్చింది. ఆమె గిఫ్ట్ అందిస్తున్న వీడియోను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. కల్యాణ్‌ బాబుకు వదినమ్మ బహుమతి అంటూ ఆయన రాసుకొచ్చారు. అయితే ఆమె అందించిన గిఫ్ట్ ఏదో కాదండోయ్... ఖరీదైన పెన్నును బహుమతిగా అందించారు సురేఖ. 

దాన్ని పవన్ కల్యాణ్‌ స్వయంగా జేబులో పెట్టారు. దాంతో పవర్ స్టార్ ఆనందంతో వదినమ్మను కౌగిలించుకుని తన సంతోషాన్ని వ్యక్తి పరిచారు. ఇంతటి అద్భుతమైన బహుమతిని అందించిన చిరంజీవి, వదినమ్మలకు ఆయన థాంక్స్ చెప్పారు. ఏపీ ప్రజల ఆశలను నిజం చేస్తావని ఆశిస్తున్నా అంటూ వీడియో చివరలో రాసుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా