అప్పటికంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి

అప్పటికంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. 2019లో వచ్చిన సీట్ల కంటే ఈసారి మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని సజ్జల విమర్శించారు. చంద్రబాబు పూర్తిగా నెగెటివ్‌ క్యాంపెన్‌ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని తెలిపారు. ఓటింగ్‌ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దని ఆయన చెప్పుకొచ్చారు.

అలాగే కేంద్రంతో కలిసి కొంతమంది అధికారులను కుట్రపూరితంగా చంద్రబాబు తప్పించారని సజ్జల ఆరోపించారు. అధికారుల మార్పుతో టీడీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించారని అన్నారు. దాంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

Related Posts