ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం

ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-సీ62 (PSLV-C62) సాంకేతిక కారణాల వల్ల అంతరాయం ఏర్పడింది.

విశ్వంభర నేషనల్, బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-సీ62 (PSL V-C62) సాంకేతిక కారణాల వల్ల అంతరాయం ఏర్పడింది. శ్రీహరికోట నుంచి సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ మిషన్‌లో మూడో దశ తర్వాత అంతరాయం ఏర్పడినట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ధృవీకరించారు. ప్రయోగంలో తలెత్తిన లోపాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ అంతరాయానికి గల కారణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో వెల్లడిస్తామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.

రక్షణ రంగానికి కీలకమైన ‘ఈఓఎస్‌-ఎన్‌1’ (అన్వేష్) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్‌తో పాటు యూకే, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం మూడో దశ వరకు ప్రణాళిక ప్రకారం విజయవంతంగా సాగింది. అయితే, ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే కీలక సమయంలో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఇది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌ (NSIL) చేపట్టిన 9వ పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగం.

Read More వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్‌

'ఈఓఎస్‌-ఎన్‌1' ప్రత్యేకత ఏమిటి?
ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కోసం ప్రత్యేకంగా రూపొందించిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం. దేశ రక్షణలో భాగంగా సరిహద్దు కదలికలను గమనిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు సమాచారం అందిస్తోంది. భూగర్భ వనరులు, పంటల స్థితిగతులను అంచనా వేస్తోంది.