ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. స్పీకర్ కు జగన్ సంచలన లేఖ
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సంచలన లేఖ రాశారు. అసెంబ్లీలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధం అంటూ అంసతృప్తి వ్యక్తం చేశారు. అసలు తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇ్వవొద్దని కూటమి ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినట్టు ఉందని తెలిపారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పదిశాతం సీట్లు ఉండాలని చట్టంలో లేదని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆ రూల్ ను అసెంబ్లీ, పార్లమెంట్ లు పాటించలేదన్నారు. ప్రజల తరఫున వాయిస్ బలంగా వినిపించాలంటే కచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలని కోరారు. ఇక అధికార కూటమి ఇప్పటికే తనపై శతృత్వాన్ని ప్రదర్శిస్తోందని తెలిపారు.
చచ్చేవరకు కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలను ప్రతిపక్ష హోదా లేకుండా వినిపించడం చాలా కష్టం. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో అధికార కూటమి తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు జగన్.



