విక్టరీ అని చెప్పి బోల్తాపడి.. కేటీఆర్ బాటలోనే జగన్
ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటే ముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. అయితే ఎన్నికల కౌంటింగ్‌కు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గన్ గురిపెట్టిన ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0’ అని కేటీఆర్ ఎన్నికల ఫలితాల రోజు కౌంటింగ్‌కు ముందే ట్వీట్ చేశారు.
అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేటీఆర్ ఫలితాల తర్వాత అదే పోస్టును రీ ట్వీట్ చేస్తూ ఓటమిని అంగీకరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు వచ్చిన ఫలితాలపై తాము బాధపడలేదని, కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు. అయితే ఈ ఓటమిని నుంచి తాము నేర్చుకుంటామని, తిరిగి బలంగా పుంజుకుంటామని వ్యాఖ్యానించారు. హ్యాట్రిక్ సాధిస్తామన్న తమ గురి తప్పిందంటూ మరో ట్వీట్ చేశారు. దీనికి వయస్సు అయిపోదు.. గురి తప్పింది అంతే..’ అని రాసుకొచ్చారు.
కాగా, తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైఎస్ జగన్ 2.0 లోడింగ్ పేరుతో బాణాన్ని వదులుతున్న జగన్ ఫొటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటేముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Hattrick Loading 3.0 👍
— KTR (@KTRBRS) December 2, 2023
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
“@ysjagan 2.0 Loading”🔥#YSJaganAgain#YSRCPWinningBig pic.twitter.com/7splpvjUoz
— YSR Congress Party (@YSRCParty) June 1, 2024