వైసీపీ గెలుస్తుందని రూ.30కోట్ల పందెం.. చివరికి..!!

వైసీపీ గెలుస్తుందని రూ.30కోట్ల పందెం.. చివరికి..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు సద్ధమవుతోంది. అయితే, ఎన్నికల వేళ వైసీపీ గెలుస్తుందని చాలా మంది బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు సద్ధమవుతోంది. అయితే, ఎన్నికల వేళ వైసీపీ గెలుస్తుందని చాలా మంది బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఏకంగా రూ.30కోట్ల పందెం వేశాడు. అయితే ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.

దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి భార్య సర్పంచ్. కాగా, వారు వైఎస్సార్సీపీ మద్దతుదారులు. సీఎం జగన్‌పై ఉన్న అభిమానంతో వేణుగోపాల్ రెడ్డి  ఆయనే గెలుస్తారని అనుకున్నాడు. అదే నమ్మకంతో రూ.30కోట్ల పందెం కట్టాడు. అయితే, ఫలితాల రోజు వేణుగోపాల్ రెడ్డి తన ఊరి విడిచి వెళ్లిపోయాడు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

అతడి జాడ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసిన వారిని ఆరాతీస్తూ ఊరంతా వెతికారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ క్రమంలో వేణుగోపాల్ రెడ్డి తన పొలం వద్ద మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related Posts