ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి..!

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి..!



ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అందరూ ఊహించనట్టుగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా.. టీడీపీ పుట్టుక నుంచి ఉన్న ఆయనకు ఈ సారి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయనకు చాలా కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దాదాపు ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 

Read More డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు

పైగా టీడీపీకి మొదట్లో అండగా ఉన్న వారిలో బుచ్చయ్య కుటుంబం కూడా ఉంది. కాబట్టి ఆయనకు మరోసారి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తాజాగా ఆయనకు ప్రొటెం స్పీకర్ పదవి రావడంపై బుచ్చయ్య స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు. 

స్పీకర్ గా నా బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన వివరించారు. ఇక మీదట ఏపీలో అసెంబ్లీ చాలా పద్ధతిగా నడుస్తుందని భావిస్తున్నాను అంటూ తెలిపారు బుచ్చయ్య చౌదరి. ఇక శుక్రవారం నాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.  

Related Posts