AP CM: నల్లమల సాగర్‌కు పోలవరం నీళ్లు.. రాష్ట్ర ప్రయోజనాలే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP CM: గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా మూడోసారి నిర్వహించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
AP CM: గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా మూడోసారి నిర్వహించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలు తనను వెనక్కి నెట్టలేవని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తాను తీసుకుంటానని చెప్పారు.
గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందించినప్పుడు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా వాటికి వెనకడుగు వేయలేదని, ఫలితంగా కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటి భద్రత లభించిందన్నారు. గొడవలు, రాజకీయ ఆరోపణల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు.
లవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. పోలవరం పూర్తి అయితే రాష్ట్రానికి దీర్ఘకాలికంగా నీటి భద్రత కలుగుతుందని చెప్పారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్లే ప్రణాళిక కూడా ఉందని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని.. తెలిపారు.
నీటి ప్రాజెక్టుల విషయంలో తన దృష్టి పూర్తిగా ప్రజల అవసరాలపైనే ఉందని చంద్రబాబు అన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు ఆధ్యాత్మికతతో పాటు రాష్ట్ర ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.



