అకాల వర్షానికి ఐకెపి సెంటర్లో  తడిసిన వరి ధాన్యం

అకాల వర్షానికి ఐకెపి సెంటర్లో  తడిసిన వరి ధాన్యం

విశ్వంభర, త్రిపురారం : వాతావరణం లో ఒక్కసారి మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం రోజున నాలుగు గంటల వరకు భానుడి ప్రతాపం తో 42 నుండి 44  డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.  దుమ్ము దూళి దుమారాలతో కూడిన వేగమైన ఇదుర గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల  తో వాతావరణం ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు సంతరించుకున్నాయి. ఈ క్రమంలో పలు గ్రామాలలో రహదారుల వెంబడి చెట్లు నేలమట్టమయ్యాయి. లోక్య తండా లో  ఈదురుగాలులు వల్ల  ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోవడం జరిగింది,, మరియు రాగడప గ్రామంలో ప్రధాన రహదారిపై పాఠశాల ఆవరణ యందు చెట్లు పడిపోయి కరెంటు తీగలు తెగి పడిపోవడం జరిగింది. అలాగే త్రిపురారం  మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  గోపు శ్యామ్ సుంధర్ రెడ్డి, ఏళ్ళ మహేందెర్ రెడ్డి, మధు మోహన్, వేణుగోపాల్ రెడ్డి పలువురి రైతుల యొక్క 1500 బస్తాల ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడం జరిగింది.  ఈ అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయి బాగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. మాకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.WhatsApp Image 2026-05-03 at 8.03.14 PM (1)

Tags:  

Advertisement