పిడుగు పాటుతో మూడు కాడెడ్లు మృతి
... రూ. 5 లక్షలు నష్ట పోయిన రైతు
విశ్వంభర, కేసముద్రం: అకాల వర్షం కారణంగా పిడుగులు పడి ఓ రైతుకు చెందిన మూడు కాడెడ్లు మృతి చెందగా సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిన సంఘటన ఆదివారం కేసముద్రం మండలం తాల్లపుసపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు బత్యం సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం. తల్లపుసపల్లి గ్రామంలో ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో గ్రామ శివారు వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్కన ఉన్న తన వ్యవసాయ భూమిలోని చెట్టు వద్ద బర్రె తో పాటు 3 కాడెడ్లను కట్టి వేసాడు. అకాల వర్షంతో పిడుగులు చెట్టు పై పడగా చెట్టుకు కట్టిన 3 కాడెడ్ల మృతి చెందాయని, బర్రె మాత్రం బతికిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మృతి చెందిన కాడెడ్ల సుమారుగా రూ. 5 లక్షల వరకు ఉంటుందని, వాటితోనే నా కుటుంబం వ్యవసాయం చేసుకుంటున్నామని రోదిస్తూ తెలిపాడు. జీవన దారం అయిన ఎడ్లు మృతి చెందడంతో వ్యవసాయం ఎలా చేసుకోవాలో తెలియడం లేదని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని ఈసందర్భంగా సమ్మయ్య వేడుకున్నాడు. రైతుబంధు మండల అధ్యక్షుడు జలంధర్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.



