ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తి వేసే కుట్రను సీఎం మానుకోవాలి: ఎంపీ ఆర్ కృష్ణయ్య

ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తి వేసే కుట్రను సీఎం మానుకోవాలి: ఎంపీ ఆర్ కృష్ణయ్య

విశ్వంభర, బషీర్ బాగ్: ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తి వేసే కుట్రను మానుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి 30 నెలల కాలంలో బడ్జెట్ విడుదల చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ఈ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్ షిప్ ఫీజులు 8వేల కోట్లు చెల్లించడానికి సిఎం కు మనసు ఒప్పుకోలేదన్నారు. బీసీలు చదువు కుంటే ఓర్వలేక పోతున్నారనీ,  ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం జి ఓ నెం.7ను విడుదల చేసిందనీ, ఈ జీవో ద్వారా విద్యార్థులకు నేరుగా లబ్ది చేకూర్చే విధంగా చెల్లింపు విధానాన్ని మార్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ వర్గా లకు చెందిన అర్హులైన విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుందన్నారు.ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పండింగ్ పీజులను చెల్లించి కుండా నగదు బదిలీ పేరుతో డైరక్టంగా విద్యార్థుట ఆకౌంట్లలోకి స్కాలర్షిప్ప, పీజు రియంబర్స్ మెంట్ చెల్లిస్తామని నిర్ణయం తీసుకుదన్నారు. జూన్ నెల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని,  మంత్రులు, ఎమ్మెల్యేలను, తిరగనియ్యమని, జులై నెలలో 5 లక్షల మందితో ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లపల్లి అంజి, సి. రాజేందర్, అనంతయ్య, గొరిగే మల్లేష్, నిఖిల్ పటేల్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Tags:  

Advertisement