ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
On
విశ్వంభర, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదివారం మహా పూర్ణాహుతి నిర్వహించి వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ తూడి దేవేందర్ రెడ్డి ఝాన్సీ లక్ష్మి దంపతులు డాక్టర్ చంద్రశేఖర్ ప్రశాంతి దంపతులు సాయంత్రం శ్రీ పుష్పయాగం ధ్వజావరోహణ కార్యక్రమం మరియు ఏకాంత సేవలు ఘనంగా నిర్వహించారు. 12 రకాల ప్రసాదాలు స్వామివారికి నివేదించి భక్తులకు అందజేశారు. బ్రహ్మోత్సవ వైభవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు హరిచరణ్ ఆచార్యులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి శ్రీ హరి ఆచార్యులు బజ్జూరి కృష్ణయ్య గజ్జల రవీందర్ కవిత జ్యోతి అరుణ రజిత పల్లవి తదితరులు పాల్గొన్నారు.



