మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని రామన్నపేట మేజర్ గ్రామానికి చెందిన చిన్నోజు రుక్నమ్మ అనారోగ్యంతో మరణించించి. విషయం తెలుసుకున్న రామన్నపేట గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపి, ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉప-సర్పంచ్ మోటి రమేష్, వార్డు సభ్యులు మొహమ్మద్ అంజద్, గొరిగే శేఖర్, మొహమ్మద్ నాసర్, జిల్లా వెంకటేశం, మొహమ్మద్ అక్రమ్, గొలుసుల ప్రసాద్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ జానీ, లవణం సాయి, తెల్ల ప్రసాద్, ఎండి నజీర్, ఎండి జలీల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement