ఎలికేశ్వరం సమీపంలో యువకుడి మృతదేహం
On
విశ్వంభర, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామ సమీపంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన యువకుడిని బొమ్మపూర్ గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై పవన్ కుమార్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యువకుడి మృతి అనుమానాస్పదంగా ఉండటంతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది



