దళారులను నమ్మి మోసపోకండి
On
విశ్వంభర. బొంరాస్ పేట్ : రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ఒడ్లు అమ్ముకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం మెట్లకుంట ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు గౌడ్, జయ కృష్ణ రామచంద్ర రెడ్డి, మల్లేష్ సర్పంచ్ ఉమాదేవి, మల్లికార్జున్ నరసింహనాయుడు మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.



