మానవత్వం చాటుకున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి
On
విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని తుంకలగడ్డ సమీపంలో కారు, బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తి కోసిగి మండలం కి చెందిన పోతిరెడ్డిపల్లి గ్రామ నివాసి కృష్ణారెడ్డికి గాయాలై రోడ్డు పక్కన పడిపోయాడు. అదే సమయంలో కొడంగల్ వైపు నుంచి వస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ కారు ఆపి గాయాలపాలైన అతనిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి స్థానిక ఎస్ఐ మోహన్ కృష్ణ కు సమాచారం ఇచ్చి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించడం జరిగింది. వెంటనే స్థానిక ఎస్సై వచ్చి జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టారు



