పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రామకృష్ణారెడ్డి
On
విశ్వంభర, పరిగి: పట్టణానికి చెందిన రామకృష్ణారెడ్డిని పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తనకు పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పట్టిష్టతకు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఐకమత్యంగా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు



