ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం భవనంలో జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం లో 2006 - 2007 వ సంవత్సరంలో చదివిన పదవ తరగతి విద్యార్థులు ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంట్ , ప్రధానోపాధ్యాయులు గుండోజు దేవేందర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి దేవేందర్ మాట్లాడుతూ 2006 - 2007 వ సంవత్సరంలో విద్యార్థులు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, మరియు ఇప్పుడు జరిగినటువంటి తీపి జ్ఞాపకాలను ఒకరికొకరు నెమరు వేసుకున్నారు . అనంతరం స్కూల్ కరస్పాండెంట్ నీ & అధ్యాపకులనీ విద్యార్థులు శాలువాతో సన్మానించి సంబరాలు జరుపుకున్నారు . ఇంకా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మీరు వివిధ హోదాల్లో ఉండి ఈ కార్యక్రమం చేయాలని మ మ్ములను గుర్తుంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించిన మీకందరికీ కృతజ్ఞతలు అని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని విద్యార్థులకి పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో 2006- 2007 వ సంవత్సరం బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు , అధ్యాపక బృందం పాల్గొన్నారు .



