వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
On
విశ్వంభర, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రానున్న రోజుల్లో అకాల వర్షాల దృష్ట్యా ఐకెపి సెంటర్లలో నిల్వ ఉన్నటువంటి వడ్లను సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని , అదేవిధంగా ఇప్పటికే ఎక్కడ కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని. గత ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా వడ్ల కొనుగోలు పక్రియ జరిగిందని ,కెసిఆర్ రైతును రాజుగా నిలిపాడని దేశంలోని వ్యవసాయ రంగాన్ని అగ్రస్థానంలో నిలిపాడని గోల్కొండ కిరణ్ తెలిపారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతిగా అని చెప్పుకుంటూ రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం ,స్థానిక మంత్రి చొరవ చూపాలని ,లేని పక్షంలో ఈ ప్రాంత రైతాంగ పక్షం నుండి రానున్న కాలంలో మూల్యం చెల్లించక తప్పదని కిరణ్ హితాబు పలికారు.



