నీట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన 

నీట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన 

  • జిల్లా ఎస్పీ నరసింహ 

విశ్వంభర, సూర్యాపేట: నీట్ పరీక్షల సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా కళాశాలల్లో పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాట్లను జిల్లా ఎస్పి నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏజన్సీ నిభందనల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రత కల్పించాము, పరీక్ష సామాగ్రి పత్రాల తరలింపులో అధికారులతో సమన్వయం చేసుకుని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు” తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు తీసుకున్నాం, ప్రత్యేక సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పరీక్ష నిర్వహణ అధికారులు ఉన్నారు.

Tags:  

Advertisement