ఆకట్టుకున్న సంగీత నృత్య సమ్మేళనం

ఆకట్టుకున్న సంగీత నృత్య సమ్మేళనం

 విశ్వంభర, బాగ్ లింగంపల్లి : శ్రీ రాగ రమ్య కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు సంగీతం, వాయిద్య కళలలో ప్రతిభను ప్రదర్శిస్తూ కళాకారులు సంగీత నృత్య సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు రమ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు శంకర్ నారాయణ, వీణ సంగీత గురువు మాధవి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మన సంస్కృతిని పరిరక్షించడంలో సంగీతం, నృత్యం వంటి కళలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి మనసులకు ఆహ్లాదం కలిగించడంతో పాటు సమాజ సేవకు దోహదపడతాయి” అని తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:  

Advertisement