మల్టీజోన్​–1 పరిధిలో ఇన్​స్పెక్టర్ల బదిలీ

మల్టీజోన్​–1 పరిధిలో ఇన్​స్పెక్టర్ల బదిలీ

విశ్వంభర, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్​–1 పరిధిలో ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 15 మందిని బదిలీ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్​ఫర్​ అయిన వారిని వెంటనే రిలీవ్​ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బదిలీ అయిన ఇన్​స్పెక్టర్లు కొత్త స్థానాల్లో చేరనున్నారు. వెయిటింగ్​లో బియాని సంతోష్​ రావును మహబూబాబాద్​ సీసీఎస్​కు బదిలీ చేశారు. మెట్​పల్లి సీఐగా ఉన్న బి.సురేష్​ బాబును కరీంనగర్​ సీఎస్​బీ–2కు పంపించారు. కామారెడ్డి పీసీఆర్​లో ఉన్న జగడం నరేశ్​ను భిక్కనూరు సీఐగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ఎం.సంపత్​ కుమార్​ను ఐజీపీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. రామగుండం టాస్క్​ఫోర్స్​లో ఉన్న గంగాధర రమేశ్​ బాబును రామగుండం సీఎస్​బీ–3కు పంపించారు. నిజామాబాద్​ సీసీఎస్​లో ఉన్న పింగలి మహేందర్​ రెడ్డిని సిద్దిపేట వన్​టౌన్​ ఎస్​హెచ్​వోగా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎస్​.వాసుదేవ రావును ఐజీపీ కార్యాలయానికి అటాచ్​ చేశారు. రామగుండం సీసీఎస్​లో ఉన్న సీహెచ్​.విద్యాసాగర్​ను సిద్దిపేట రూరల్​ సీఐగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న మడుగుల శ్రీనును ఐజీగా కార్యాలయానికి పంపించారు. రామగుండం లీగల్​ సెల్​లో ఉన్న వై.కృష్ణకుమార్​ను రామగుండం సర్కిల్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఇక సీఐడీలో పనిచేస్తున్న కోటగిరి శ్రీధర్​ను రామగుండం లీగల్​ సెల్​కు బదిలీ చేశారు. కరీంనగర్​ పీటీసీలో ఉన్న మంచినీల శ్రీనివాస్​ను మహబూబాబాద్​ ఎస్​హెచ్​వోగా నియమించారు. ఇచ్చోడ సీఐగా ఉన్న బండారి రాజును వరంగల్​ కమిషనరేట్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఆదిలాబాద్​ పీసీఆర్​లో పనిచేస్తున్న సీహెచ్​.రమేశ్​ను ఇచ్చోడ సీఐగా పంపించారు. జగిత్యాల వీఆర్​లో ఉన్న కె.నరేశ్​ను ఆదిలాబాద్​ పీసీఆర్​కు బదిలీ చేశారు.

Tags:  

Advertisement