తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్
On
విశ్వంభర, నిజామాబాద్ : తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆర్మూర్ వాస్తవ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఇదివరకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర ఉపాధ్యక్షుడు , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కల్లుగీత వృత్తిదారులు గౌడ జాతి సంక్షేమం హక్కుల కోసం ,ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న యువజన గౌడ సంఘం తనను గుర్తించి ఈ అత్యున్నత బాధ్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గౌడ కులస్తుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని తెలియజేశారు.



