ఉప సర్పంచుల ఫోరమ్ జిల్లా ఉప అధ్యక్షులుగా కొత్తపల్లి సతీష్ 

ఉప సర్పంచుల ఫోరమ్ జిల్లా ఉప అధ్యక్షులుగా కొత్తపల్లి సతీష్ 

విశ్వంభర, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా ఉప సర్పంచులఫోరమ్ ఉపఅధ్యక్షులుగా కమాన్ పూర్ మండలంలోని సిద్ధిపల్లె గ్రామ ఉప సర్పంచ్ కొత్తపల్లి సతీష్ ను రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరమ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రాములు నాయక్, జిల్లా అధ్యక్షులు తలారి స్వప్న సాగర్  నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లాలోని రుచి గ్రాండ్ బ్యాంక్వెంట్ హాల్లో జరిగిన ఉపసర్పంచుల ఆత్మీయ సమావేశంలో పెద్దపల్లి జిల్లా ఉపసర్పంచులందరూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఉప సర్పంచుల ఫోరమ్ ఆధ్వర్యంలో కొత్తపల్లి సతీష్ కు శాలువాలు కప్పి ఘనంగా ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్బంగా,  సిద్దిపల్లె ఉపసర్పంచ్ కొత్తపల్లి సతీష్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Tags:  

Advertisement