కేసముద్రంలో కన్నులపండువగా హిందూ సమ్మేళనం

కేసముద్రంలో కన్నులపండువగా హిందూ సమ్మేళనం

విశ్వంభర, కేసముద్రం: హరిహర గార్డెన్స్‌ మండల కేంద్రమైన కేసముద్రంలో "హిందూ సమ్మేళనం" అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. హిందూ ధర్మ పరిరక్షణ, ఐక్యత మరియు సామాజిక చైతన్యం లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు, హిందూ బంధువులు తరలివచ్చారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ఖమ్మం విభాగ్ సహ సంఘచాలక్ పనిభట్ల రాజేశ్వర శాస్త్రి గారు మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని ఏకం చేయడం, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడం నేటి తక్షణ అవసరమని అన్నారు. సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తూ, మన కుటుంబ విలువలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. "మన ధర్మం-మన బాధ్యత" అనే నినాదంతో సమాజం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి సంకేపల్లి కీర్తన రెడ్డి గారు 'పంచ పరివర్తన' అంశంపై మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం, ఉమ్మడి భోజనం, సంస్కారవంతమైన విద్య, పెద్దలను గౌరవించే అలవాటును పెంచడం, రాజ్యాంగాన్ని గౌరవించడం, ఓటు హక్కు వినియోగం, చట్టాన్ని పాటించడం మరియు సామాజిక బాధ్యతతో ప్రవర్తించడం ,భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభాషను గౌరవించడం మరియు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం,వ్యక్తిగత మరియు సామాజిక మార్పు ద్వారానే హిందూ సమాజం బలోపేతం అవుతుందని వివరించారు. ధర్మ జాగరణ సదస్సు తెలంగాణ ప్రాంత ప్రతినిధి, విశిష్ట అతిథి శ్రీశ్రీశ్రీ వాల్యానంద స్వామిజీ గారు ఆశీర్వచనాలు అందిస్తూ.. సామాజిక సామరస్యం మరియు సాధికారతపై దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మికతతో కూడిన సాంస్కృతిక జీవనమే హిందూ ధర్మానికి వెన్నెముక అని పేర్కొన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ గారు మాట్లాడుతూ.. హిందూ ఐక్యత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అందరం కలిసికట్టుగా ధర్మం కోసం నిలబడాలని కోరారు.
హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు, ప్రముఖ సామాజికవేత్త శ్రీ వోలం గోవర్ధనగిరి గారు మాట్లాడుతూ.. మన పూర్వీకులు అందించిన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సమ్మేళనం విజయవంతం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త తుంపిల్ల శ్రీనివాస్ , పింగిళి శ్రీనివాస్, వెలిశాల సవీన్ ,మున్సిపల్ కౌన్సిలర్లు దారవత్ కిషోర్, వేముల భారతి, రావుల వినయ్, తరాల వీరేష్, దూడపాక కృష్ణ, బానోత్ వెంకన్న ,వోలం బుచ్చి లింగం, వోలం రాజు, వోమ సంతోష్, గుంజ శ్రీనివాస్, కంచు సురేందర్, వోలం వీరభద్రరావు, తోనుపునురి భాస్కర్ ,వోలం శ్రీనివాస్, లెన్కలపల్లి శ్రీనివాస్ ,వోలం సతీష్, చిల్లంచర్ల సతీష్, ఉప్పునూతల రమేష్, , బచ్చు లక్ష్మీనారాయణ ,బొద్దుల సతీష్, రుద్ర శ్రీకాంత్,  సామల రమేష్, చందా గోపి, శరణ్య రాజు చింతనూరి సతీష్, బొద్దుల సురేందర్ , రాపాక కుమార స్వామి ,మైసా రోహిత్ మంగా వెంకన్న , అల్లం నిరంజన్ , పింగిలి రాజేందర్ మండలంలోని పలువురు ప్రముఖులు, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేశారు

Tags:  

Advertisement