శిల్పా మెరిట్ అవార్డ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం
విశ్వంభర, హైదరాబాదు : 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 95 శాతం పైగా మార్కులు సాధించిన తెలంగాణ విద్యార్థులకు శిల్పా మెరిట్ అవార్డ్స్ అందజేయనున్నట్లు శిల్పా ఆర్ట్ క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కాపర్తి ప్రకాష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడం మా లక్ష్యం అని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో గత 33 సంవత్సరాలుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ అవార్డులు అందజేస్తూ వస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు మార్కుల జిరాక్స్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ జతపరచి పంపాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు చదివిన పాఠశాల యాజమాన్యాలకు, గురువులకు కూడా పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హుల ఎంపిక తుది నిర్ణయం ట్రస్ట్ సభ్యులదేనని స్పష్టం చేశారు. మే 20లోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. చిరునామా: ఎఫ్-14, రజనిగంధా అపార్ట్‌మెంట్స్, మహేశ్ బ్యాంక్ బిల్డింగ్, చైతన్యపురి ఎక్స్ రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాదు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు: 9347057740.



