అర్హులందరికీ సంక్షేమ పథకాలు – కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే యాదయ్య, గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి*
On
విశ్వంభర, షాబాద్:షాబాద్ మండల పరిధిలోని రేగడి దోస్వాడ గ్రామానికి చెందిన గడీల బాలమని భర్త జంగయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కును చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, రేగడి దోస్వాడ గ్రామ సర్పంచ్ పావని రమణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



