బాధితుడి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు
విశ్వంభర, రామన్నపేట: పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని స్థితిలో ఉన్న బాధితుడి వద్దకే వెళ్లి రెండు కేసులను నమోదు చేసిన ఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, దుబ్బాక దుబ్బాక గ్రామానికి చెందిన మెడబొయిన పద్మ పెద్దకొడుకు మెడబొయిన పరుశురాములు వయస్సు(35), తన భార్య, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ నందు కార్ వాషింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. భార్య, బర్తలకు ఇంట్లో గోడవ కావడంతో ఇద్దరు తన పిల్లలతో కలిసి గత రెండు రోజుల క్రితం తన ఇంటికి దుబ్బాక గ్రమంకు వచ్చినారు. తన కొడుకు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిన అతను ఈ రోజు వరకు రాకపోవడంతో ఈ విషయం రామన్నపేట ఎస్సై నాగరాజుకు తెలపడంతో వెంటనే ఏ.ఎస్.ఐ సురేందర్, రైటర్ స్వామి నాయక్, లింగస్వామి తో కలిసి దుబ్బాక గ్రామంకు ఫిర్యాది ఇంటికి స్వయంగా వెళ్లి బాధితులని పరామర్శించి, ఫిర్యాదును స్వీకరించి, బాధితుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, న్యాయం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో సంఘటన స్థలంలోనే ఆన్-సైట్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, కేసును చట్టం ప్రకారం నమోదు చేసినారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నా కూడా ప్రజలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, అవసరమైన సందర్భాల్లో పోలీసులు స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఎస్సై డి నాగరాజు తెలిపారు.



