ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం 

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం 

 విశ్వంభర,  కుత్బుల్లాపూర్:  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా సుచిత్రలో ఇందిరా మహిళా శక్తి కాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి  మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్‌ను ప్రారంభించామని తెలిపారు. మహిళా శక్తి  క్యాంటీన్‌ను   ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని  మహిళా సాధికారత దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని, మహిళా స్వయం ఉపాధికి తోడ్పాటు అందించడం, ప్రజలకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయబడింది తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దమ్మని  శ్రవణ్ ముదిరాజ్, బేకు శ్రీనివాస్, లక్ష్మీ చౌదరి, మైసీగారి శ్రీనివాస్, సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, జక్కుల మల్లేష్ యాదవ్, ముత్యం రెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్, రంగయ్య, బాలప్ప, సుజాత యాదవ్, నాగ, రేవతి, మాధురి, కూన చింటూ, మహిళలు తదితరులు  పాల్గొన్నారు.

Tags: