స్మశాన వాటికను పరిశీలించిన సర్పంచి
On
విశ్వంభర, నెల్లికుదురు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలోని మునిగలవీడు సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు బుధవారం ఆ గ్రామంలోని స్మశాన వాటికను పరిశీలించారు. పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, ముళ్ళ కంపచెట్లతో అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బంది తదితరులతో తొలగింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పురస్కరించుకుని గ్రామంలో నిర్దేశించిన పనులను చేపట్టినట్లు తెలిపారు.ప్రజల సహకారంతో మిగిలి ఉన్న పనులను సైతం పూర్తి చేయనున్నట్లు చెప్పారు



