75శాతం రాయితీపై గడ్డి విత్తనాలు

75శాతం రాయితీపై గడ్డి విత్తనాలు

విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేసే గడ్డి విత్తనాలను రైతులకు 75 శాతం  రాయితీపై అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెటర్నరీ డా. రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం ఇనుగుర్తి లోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో సంబంధిత విత్తనాలు లభిస్తాయని పేర్కొన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు వివిధ గ్రామాలు, తండాలకు చెందిన రైతులందరూ పశువులకు పచ్చి గడ్డితో కూడిన దానా అందించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కర్షకులు తమ ఆధార్ కార్డు తో పాటు పట్టా పాస్ పుస్తకానికి సంబంధించిన జిరాక్స్ ప్రతి తో వెటర్నరీ హాస్పిటల్ లో సంప్రదించాలని తెలిపారు.

Tags: