ఇస్కాన్ ట్రస్ట్ నిత్య అన్నదానం ప్రారంభం

ఇస్కాన్ ట్రస్ట్ నిత్య అన్నదానం ప్రారంభం

విశ్వంభర, హైదరాబాద్ :  పేదల ఆకలి తీర్చడమే ఇస్కాన్ సైబరాబాద్ ట్రస్ట్ ప్రధాన ధ్యేయమని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్  గంగాధర్ రెడ్డి అన్నారు. గోపనపల్లి లోని రంగనాథ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఇస్కాన్ సైబరాబాద్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన నిత్య ఉచిత బ్రేక్‌ఫాస్ట్ సేవను ఆయన బుధవారం  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రస్ట్ అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు ఆహారం అందిస్తున్నదని తెలిపారు. గర్భిణీ స్త్రీలు  చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.ప్రతిరోజు ఉదయం 9.00 గంటల నుండి 10.30 గంటల వరకు నిర్వహించబడే ఈ ఉచిత బ్రేక్‌ఫాస్ట్ సేవ ద్వారా భక్తులు, స్థానిక ప్రజలు మరియు అవసరమైన వారికి పోషకాహారం అందించబడుతుందని తెలిపారు.భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరించి ఎక్కువ మందికి చేరవేసేలా చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ సేవల ద్వారా అనేకమంది ఆకలి బాధలు తీరుతాయని, అందుకు ట్రస్ట్‌ను గంగాధర్ రెడ్డి అభినందించారు.స్థానిక ప్రజలు ఈ సేవలను వినియోగించుకుని ట్రస్ట్ కార్యకలాపాలకు సహకరించాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు  భక్తులు పాల్గొన్నారు.

Tags: